బాలికపై జీహెచ్ఎంసీ ఉన్మాది..
posted on May 28, 2021 9:47AM
రోజు రోజుకి మనుషులు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. సమాజం క్షమించలేని పనులు చేస్తున్నారు. నీచమైన పనులకు తెర తీస్తున్నారు. గుంటూరులో ఒక మహిళపై యువజన కాంగ్రెస్ నాయకులూ అత్యాచారం చేశారు. మొన్న జగిత్యాలలో టీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో పనిచేస్తున్న 17 ఏళ్ళ అమ్మాయి ని అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఉద్యోగి ఓ బాలికపై అత్యాచారం చేశాడు.
వివరాల్లోకి వెళితే..అతని పేరు భాస్కర్ రావు. షెల్టర్ మేనేజర్ గా గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ ఔట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. జంతువుల సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. బాధిత బాలిక తల్లి రహేమా కాపాలదారుగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రహేమా కూతురుపై భాస్కర్ రావు కన్నేశాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలనుకున్నాడు. అందుకు ఆ అమ్మాయి తల్లి అడ్డు అనుకున్నాడు. ఆమె అక్కడ ఉంటే అతనికి సందు దొరకదు అనుకున్నాడు. అందుకోసం ఒక పథకం వేశాడు. అందులో భాగంగానే బాలిక తల్లికి ఇతర పని అప్పగించాడు. ఆమె ఆ పని నిమిత్తం వెళ్లగానే.. బాలికపై భాస్కర్ రావు లైంగిక దాడి చేశారు.
రహేహా కూతురు బాత్రూమ్ కి వెళ్లగా.. అక్కడే ఉండి అత్యాచారానికి యత్నించాడు భాస్కర్ రావు. అయితే భాస్కర్ రావు దాడిని ఎదురించిన బాలిక..గట్టిగా అరుస్తూ బయటకు వచ్చింది. విషయం తెలియగానే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు.. విచారణ చేపటటారు. బాధితులకు తోటి జిహెచ్ఎంసి సిబ్బంది అండగా నిలిచారు. భాస్కర్ రావు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.