వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్
posted on Jun 18, 2025 1:59PM

అవాంతరాలు లేని హైవే ప్రయాణం అందించడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకువస్తున్నది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోనికి రానున్న ఈ సాస్ జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉ:టుంది.
ఈ కొత్త ఫాస్టాగ్ పాస్ ను 3వేల రూపాయలు చెల్లించి తీసుకుంటే.. దానిని ఉపయోగించి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ పాస్టాగ్ పాస్ ను కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చునని తెలిపారు.