అవమాన భారంతో ఏడ్చిన ఈటల రాజేందర్! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకునేందుకు మజీ మంత్రి ఈటల రాజేందర్ సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ఓపెన్ చాలెంజ్ విసిరారు. తమపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా అక్రమాలు జరిగినట్లు నిరూపించాలంటూ ఈటల జమున సవాల్ చేశారు. ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? చర్చకు సిద్ధమేనా అంటూ జమున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈటల జమున. 

సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికామన్నారు జమున. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రగతి భవన్ గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చినా సందర్భాలు ఉన్నాయన్నారు జమున. ఉమ్మడి రాష్ట్రంలో ఈటెల కు జ్వరం వస్తే అప్పటి పాలకులు వచ్చి పరామర్శించారని.. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదన్నారు. ఉద్యమంలో ఈటెల రెండు మూడు రోజులు ఇంటికి రాకపోయినా కూడా దైర్యంగా ఉన్నామని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవన్నారు. వైఎస్సార్ పార్టీలోకి  ఆహ్వానిస్తే  వెళ్లని వ్యక్తి రాజేందర్ అని చెప్పారు. అధికారం ఉందని ఎం చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటన్నారు జమున. 

ఉద్యమంలో ఈటెల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..? అని జమున ప్రశ్నించారు. తాను వ్యాపారం చేస్తూ ఈటెలను ఉద్యమంలోకి పంపానని చెప్పారు.  తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారని జమున తెలిపారు.  ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగాలన్నారు. తన  ఆస్తులు మొత్తం అమ్మి ఐనా సరే మా ఆయనకు అండగా ఉంటానని జమున స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమేనన్నారు. నయీమ్ చంపుతాను అంటే భయపడలేదన్నారు. 

వకులాభారణం మొహం చూసి ఒక్క వోట్ పడతాదా అని జమున ఎద్దేవా చేశారు. అన్నా అని బతిలాడితే బీసీ కమిషన్ లో సభ్యుడిగా నియామకం జరిగేలా చేశారన్నారు. తన  ఇంట్లో అన్నం తిన్న వాళ్ళతోనే తిట్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులు తన కుటుంబం కోసమే పని చేస్తున్నట్లు ఉందన్నారు. సమైక్య పాలనలో కూడా ఇన్ని ఇబ్బందులు లేవన్నారు జమున. ఇప్పుడు రెడ్డి-ముదిరాజ్ లమని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. కులాల పేరుతో పాలన చేస్తున్నారని జమున మండిపడ్డారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu