ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అవకతవకలపై ఈడీ నజర్

ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో అవకతవకలు జరిగినట్లుగా బంజర హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు ఎఫ్ ఐ ఆర్ లను ఆధారంగా   ఈడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్ల గ్రామంలో ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అప్పటి ఎండి అండ్ సీఈఓ అయిన ఉమేష్ చంద్ర ఆసవా కుమారుడు రోహిత్ అసవా పేరు మీద ఉన్న 1.1 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను   తాత్కాలికంగా జప్తు చేసింది.

 అప్పటి చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, అప్పటి ఎండి అండ్  సీఈవో ఉమేష్ చంద్ అసవా ,  సీనియర్ వైస్ చైర్మన్ పురుషోత్తమ దాస్ మంధాన మరియు ఇతరు లు కలిసి అధికారిక పదవులను దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. లేని ఆస్తులపై రుణాలు పంపిణీ చేయడం ద్వారా ఆ పంపిణీ  చేసిన మొత్తం రుణ   రెండు శాతం నుండి నాలుగు శాతం వరకు కమిషన్ వసూలు చేసినట్లుగా ఈడి దర్యాప్తులో వెల్లడైంది.

ఆ విధంగా వసూలు చేసిన డబ్బులతో కుటుంబ సభ్యుల పేర్లతో అనేక స్థిరాస్తులను సంపాదించినట్లుగా ఈడి గుర్తించింది. ఆ విధంగా  ఉమేష్ చంద్ర తన కొడుకు పేరుతో రెండు స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది.  ఈ నేపథ్యంలోని ఈడీ అధికారులు ఉమేష్ చంద్ర కుమారుడి పేరుతో పేరుతో ఉన్న 1.1 కోట్ల విలువ చేసే ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu