కూలిపోతున్న మస్క్ ఉపగ్రహం

ఎలాన్ మస్క్ కు చెందిన  స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహం కక్ష్య నుంచి అదుపుతప్పి భూమి వైపు దూసుకొస్తోంది. సాంకేతిక లోపం  కారణంగా ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని స్పెస్ ఎక్స్ ధృవీకరించింది. అయితే ఈ శాటిలైట్ భూమిపై కూలి పోవడం వల్ల స్పేస్ ఎక్స్ కు కానీ, భూమికి కానీ ఎటువంటి ప్రమాదం, ముప్పు వాటిల్లదని క్లారిటీ ఇచ్చింది.

టెస్లా అధినేత  ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులోని ఉప్రగ్రహాల్లో ఒకటి డిసెంబరు 17న సాంకేతిక లోపం కారణంగా అదుపు తప్పి కూలిపోవడం ప్రారంభించింది. వారం రోజుల్లోగా ఇది భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుంది.  ఈ కూలిపోతున్న  స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu