సర్పంచ్ తండ్రి కోసం కొడుకు బిక్షాటన

 

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తమ తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని 'బిచ్చగాడు సినిమా తరహాలో ప్రతిన బూనాడో కుమారుడు.  రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఎం.రామకృష్ణయ్య అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. 

ఇదే ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు కూడా బరిలో దిగాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు భాస్కర్.. తండ్రి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈ ఎన్నికల్లో తన తండ్రి గెలిస్తే.. భిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే.. తన తండ్రి సర్పంచ్ అయ్యారు. మొక్కుబడి చెల్లించడంలో భాగంగా భాస్కర్ ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి.. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్త క్షేత్రానికి వెళ్లాడు. ఈ ఘటనపై జే.లింగాపూర్ గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిపై గల కుమారుడికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu