టెంపుల్ టౌన్లలో హోం స్టేలకు ప్రోత్సాహం.. పర్యాటక శాఖ సమీక్షలో చంద్రబాబు

టెంపుల్ టౌన్లలో హోమ్ స్టేలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం (సెప్టెంబర్ 3) పర్యాటక శాఖపై సమీక్షించిన ఆయన  తిరుపతి సహా రాష్ట్రంలోని అన్ని ముఖ్య దేవాలయాల పట్లణాలలో వీటిపై దృష్టి పెట్టాల న్నారు.  కోనసీమలో గ్రామీణ వాతావరణం అనుభూతి చెందేలా హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలనీ, వీటిలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.  ఈ  హోమ్ స్టేలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలన్నారు. విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో నిరంతరం ఏదోక టూరిజం ఈవెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు స్థలాలను గుర్తించాలని చంద్రబాబు  అధికారులకు సూచించారు. 

అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలన్న చంద్రబాబు..  కొండపల్లి ఖిల్లా లాంటి ప్రాజెక్టులను దత్తత తీసుకునేలా ప్రైవేటు భాగస్వాములను గుర్తించాలన్నారు. ఉండవల్లి గుహల వద్ద లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటుతో పాటు, చింతపల్లిలో ఎకో టూరిజం, కుప్పంలో ఏనుగుల సఫారీ, విశాఖలో డాల్ఫిన్ షో వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

పర్యాట రంగానికి మరింత శోభ తెచ్చేలా అదనపు ఆకర్షణలు జోడించటంతో పాటు, స్థానికంగా ఉన్న ఉత్పత్తులను కూడా బ్రాండింగ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేకంగా నిర్వహించే ఈవెంట్లలోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ, అలాగే అరుదైన ఎర్రచందనం బొమ్మలు, ఫర్నిచర్ లాంటి ఉత్పత్తులను కూడా ప్రదర్శించాలన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu