శ్రీవారి సేవకులకు నిరంతర శిక్షణ కోసం నూతన సాఫ్ట్ వేర్.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
posted on Sep 4, 2025 9:22AM
.webp)
తిరుమల శ్రీవారి దర్శనార్ధం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్ వైజర్లు, ట్రైనర్లతో నిరంతర శిక్షణ ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్‌నాయుడు తెలిపారు. ఇందు కోసం నూతన సాఫ్ట్ వేర్ రూపొందించినట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం (సెప్టెంబర్ 3) న ఆయన ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్వో మురళికృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడారు.
తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్లను పారదర్శకంగా కేటాయించినట్లు తెలిపారు. భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని ప్రముఖ ఆహార పదార్థల తయారీ సంస్థలకుఈవోఐ ద్వారా పారదర్శకంగా కేటాయించిందన్నారు.
టీటీడీ రూపోందించిన నూతన విధానానికి అనుగుణంగా నిపుణుల కమిటీ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలలు, ఇతర అంశాలను పరిశీలించిందని చెప్పారు. అలాగే లాభాపేక్ష లేకుండా భక్తులకు సేవలందించేందుకు ఆయా సంస్ధలు ముందుకు వచ్చాయని బీఆర్ నాయుడు తెలిపారు. 5 బిగ్, 5 జనతా క్యాంటిన్లకు ఈ ఏడాది జూన్ 14న నోటిఫికేషన్ ఇచ్చి సీల్డ్ ఈవోఐ దరఖాస్తులను ఆహ్వానించామనీ. ఇందులో టీటీడీ నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను పరిశీలించి కేటాయించామనీ బీఆర్ నాయుడు వివరించారు.