ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి
posted on Dec 18, 2025 11:22AM
.webp)
ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లూ కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం (డిసెంబర్ 18) తెల్లవారు జామున ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.
ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. అటవీ ప్రాంతంలోని పల్లెపల్లెనూ జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పులలో ముగ్గురు మరణించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.