దావూద్‌ తమ్ముడి కొడుకు... అమెరికాలో అరెస్టు

 

దావూద్‌ తమ్ముడి కొడుకు సొహైల్ అమెరికాలో అడ్డంగా పట్టుబడిపోయాడు. తను కూడా పెదనాన్నంత పేద్ద డాన్‌గా మారాలనుకున్న సొహైల్ ఆశలకు ఇక జైళ్లో నీళ్లు వదులుకోవలసిందే! ఎందుకంటే సొహైల్‌ కనుక అమెరికా న్యాయస్థానంలో దోషిగా తేలితే దాదాపు 25 సంవత్సరాల జైలు శిక్షను విధించే అవకాశం ఉంది. పాకిస్తాన్‌ నుంచి మత్తుపదార్థాలను విక్రయించడమే కాకుండా, తీవ్రవాదులు క్షిపణులను అందిస్తున్నాడన్న ఆరోపణల మీద సొహైల్‌ను అరెస్టు చేశారు. సొహైల్‌ దావూద్‌ చిన్న తమ్ముడైన నూరా సంతానం.

 

నూరా చనిపోయిన తరువాత సొహైల్‌ బాధ్యతలు దావూదే చూసుకునేవాడట. అయితే అతనకి కూడా తెలియకుండా సొహైల్‌ ఇష్టారాజ్యంగా చీకటి వ్యాపారాలతో చెలరేగిపోవడం మొదలుపెట్టాడు. సొహైల్ అలా పోయి పోయి చట్టానికి చిక్కుకోవడం ఇప్పుడు దావూద్‌కి చాలా ఇబ్బంది కలిగిస్తోందట. సొహైల్ జైళ్లో ఉంటే తమ కుటుంబ ప్రతిష్టకి మచ్చగా భావిస్తున్నాడట దావూద్‌. అందుకే సొహైల్‌ను ఎలాగైనా బయటకి రప్పించేందుకు అమెరికాలనే అతి ఖరీదైన లాయర్లను నియమించినట్లు సమాచారం. భారతదేశంలో అయితే దావూద్ పప్పులు ఉడికేవి కానీ మరీ అది అమెరికా అయిపోయిందయ్యే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu