జెండా పాతాలంటే 40 లక్షలు
posted on Feb 20, 2016 4:58PM

కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ జాతీయ జెండాను నెలకొల్పాలని ఇటీవల ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే! విద్యార్థులలో దేశభక్తిని పాదుకొల్పేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇదేమంత తేలికైన విషయంగా కనిపించడం లేదు. అంతత్తున ఉండే విశ్వవిద్యాలయ భవనాల దగ్గర జెండా కనిపించాలంటే జెండా స్తంభం కనీసం 200 అడుగుల ఎత్తున ఉండాలి.
సదరు స్తంభం తుపాను గాలులకీ, పిడుగులకీ తట్టుకునేలా ఉండాలి. అందుకోసం కనీసం 40 లక్షలు ఖర్చువుతుందని తేలింది. ఇంతేకాదు! ఆ జెండా రాత్రిపూట అందరికీ కనిపించేందుకు అవసరమయ్యే విద్యుత్తు, జెండాని నిరంతరం కాపలా కాసేందుకు బందోబస్తు ఖర్చూ... వంటి నెలవారీ ఖర్చులు వేలకివేలు అవుతాయట. ఇలా 46 విశ్వవిద్యాలయాల వద్ద జెండాని నెలకొల్పవలసి ఉంటుంది. అంటే ఒకో జెండాకీ 40 లక్షలు చొప్పున దాదాపు 18 కోట్ల ఖర్చన్నమాట. దేశభక్తి చాలా ఖరీదే సుమా!