వరంగల్‌ను ముంచెత్తిన భారీ వర్షం
posted on Sep 7, 2025 11:11AM
.webp)
వరంగల్‌ను భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఉదయం వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ మార్గంలో వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అన్నారం, మహబూబాద్ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. పలు కాలనీలు నీట మునిగాయి. వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు.