వ్యాక్సిన్ కు రెక్కలు వచ్చాయి ..

వ్యాక్సిన్ కు రెక్కలు వచ్చాయి ఇదేమి చోద్యం మేము ఎప్పుడు వినలేదు చూడలేదు అంటున్నారా అవును మీరన్నది నిజమే నేనన్నది నిజమే. దాదాపు  నాలుగు వారాలకు పైగానే వ్యాక్సిన్ దొరకక సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వ్యాక్సిన్ దొరుకు తుందా ఎంత డబ్బైనా పరవాలేదు.  ఏదోరకంగా వ్యాక్సిన్ వేసుకుందాం అనుకున్న సామాన్యుడికి సరైన సమాచారం లేకపోగా అసలు ఏ ఆసుపత్రిలో ఏ  వ్యాక్సిన్ అన్న సమాచారం లేదు. అదికాక ప్రైవేటు ఆసుపత్ర్హ్రులు ఉత్పత్తిదారుల వద్ద కొనుగోలు చేయాలనీ తెలంగాణా ప్రభుత్వం ప్రకటన చేయడం అంతకుముందే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కేంద్రానికి ఒకరేటు, రాస్గ్త్రానికి ఒకరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు మరోరేటు అంటూ ప్రకటించాయి. అంతే వ్యాక్సిన్ కోసం వెతకని చోటు అంటూ లేదు. వాకబు చేయని ఆసుపత్రి అన్టూలేదు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా తీసుకుందామని ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేద్దామంటే స్లాట్ అవైలబులిటీ లేదు సరికదా ఆన్ లైన్ రిజిస్త్రషన్ ఉన్నఇక్కడ ఓపెన్ కావడం లేదంటూ తిప్పి పంపారు. ఎక్కడ వెతుకులాడినా దొరకని వ్యాక్సిన్ అనుకోకుండా ఒక పేరుమోసిన ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లి కనుక్కున్నా అంతే సార్ మీకు సెకండ్ డోస ఫస్ట్ దోసా అన్నాడు సెక్యురిటీ ఫస్ట్ డోస్ అన్న ఫస్ట్ డోస్ అంటే 15౦౦ / సెకండ్ డోస్ అంటే 125౦/ అన్నారు అంతే మొన్నటిదాకా వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రైవేటు ఆసుపత్రులు వాటిధరను అమాంతం పెంచుతాయని 
అందుకే ఆసుపత్రులు వ్యాక్సిన్ కొటా ఇ వ్వలేదని చెప్పుకుంటూ వచ్చాయి.  అంటేనే ఎదో ఉందంటూ మేమువేసిన అంచనా నిజమయ్యింది.

ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్19 రోగులవద్ద దోపిడీ చేస్తోంటే ఇక వ్యాక్సిన్ రేటు ను ఎవరు నిర్ణయించారు వ్యాక్సిన్ ధరల పైన నిఘానియంత్రణ ఉందా అన్నది అనుమానం.15౦ ౦ కు పైగా వ్యాక్సిన్ కొంటె రానుపోను ఖర్చులు వెరసి ఇంటిల్లిపాదికీ వ్యాక్సిన్ వేయించాలి లోక్ డౌన్ పుణ్యమా అని మళ్ళీ ఖర్చులు పెరిగి అప్పుల పాలు కాక తప్పదని సామాన్యుడు వాపోతున్నాడు.