ఛీ పాడు.. ఆ ఎంపీ ఉన్నాడే.. మ‌ళ్లీ మ‌ళ్లీ అవే గ‌లీజు ప‌నులు..

కెనడా ఎంపీ విలియం అమోస్. ఈ పేరు విన‌గానే ఎవ‌రికీ ట‌క్కున గుర్తుకు రాక‌పోవ‌చ్చు. కెనడాలో ఇటీవ‌ల ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో న‌గ్నంగా క‌నిపించిన ఎంపీ అంటే న్యూస్ ఫాలో అయ్యే వారంతా వెంట‌నే గుర్తు ప‌ట్టేస్తారు. ఆ.. అత‌నే ఇత‌ను. అత‌గాడు అలాంటిదే మ‌రో అగ్లీ ప‌ని చేసి.. మ‌ళ్లీ టాక్ ఆఫ్ ది న్యూస్‌గా మారాడు. 

కెనడా ఎంపీ విలియం అమోస్ మళ్ళీ వార్తల్లోకెక్కాడు. ప్రభుత్వానికి సంబంధించి ఓ కార్యక్రమం జరుగుతుండగా అది వీడియో కాల్ అనే విషయం మరచి కాఫీ కప్‌లో మూత్ర విసర్జన చేశాడు. ఆ దృశ్యాలు లైవ్‌లో ప్ర‌సారం కావ‌డంతో.. అంతా అవాక్క‌య్యారు. ఆ అస‌హ్య ప‌నికి అంతా చీద‌రించుకున్నారు. 

ఒకే వ్య‌క్తి.. ఒకేలాంటి రెండు సంద‌ర్భాల్లో అలా అన్‌పార్ల‌మెంట‌రీ ప‌నులు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కానీ, స‌ద‌రు ఎంపీ మాత్రం ఈ రెండు సంఘటనలు యాదృచ్చికమని అంటున్నాడు. చేసిన ప‌నికి ఎంతో చింతిస్తున్నానని చెబుతున్నాడు. 

గత రాత్రి వర్చ్యువల్ గా హౌస్ ఆఫ్ కామన్స్ ప్రొసీడింగ్స్ జరుగుతుండగా అది వీడియో ప్ర‌సారం అవుతోంద‌ని తెలీక తాను ఈ పని చేశానని లెంప‌లేసుకుంటున్నాడు. తన చర్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని ట్విట్టర్‌లో కోరాడు. తన ఆపాలజీని పోస్ట్ చేశాడు. పబ్లిక్ కి తాను కనబడనని భావించి అలా చేసినట్టు చెప్పాడు. ఇది పూర్తిగా తన పొరబాటేనన్నాడు. ఇందుకు పార్లమెంటరీ సెక్రటరీగా తన బాధ్యతల నుంచి కొంతకాలం తప్పుకుంటానని తెలిపాడు. తన నియోజకవర్గ ప్రజలు, తన స్టాఫ్, తన తోటి ఎంపీలు తనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని.. అలాగే తన కుటుంబానికి కూడా కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశాడు. 

కెనడా ఎంపీ విలియం అమోస్ పూర్తి నగ్నంగా ఉన్న ఓ స్క్రీన్ షాట్ గత ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో వైరల్ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్పుడు మళ్లీ అదే ఎంపీ.. కాఫీ కప్‌లో మూత్ర విసర్జన చేసి కాంట్ర‌వ‌ర్సీ అయ్యాడు. కెనడాలోని కొందరు ఎంపీలు లైంగిక వేధింపుల విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఎంపీలను జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఎలా భరిస్తోందో మరి...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu