భారత్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్

 

కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్‌ ఎంపికైంది. 2030లో భారత్ వేదికగా జరిగే ఈ క్రీడాలు గుజరాత్‌లోని  అహ్మదాబాద్ నగరాన్ని ఎంపిక చేస్తూ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. నవంబర్‌ 26న జరిగే బోర్డు జనరల్‌ అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.2030 కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణకు నైజీరియాలోని అబుజా సైతం పోటీ పడుతోంది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మాత్రం అహ్మదాబాద్‌ను సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించింది. 2010లో భారత్ తొలిసారిగా కామన్‌వెల్త్ గేమ్స్‌కు అతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఇటీవల ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషా, గుజరాత్‌ ప్రభుత్వంతో కలిసి కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌  చీఫ్‌ క్రిస్‌ జెంకిన్స్‌కు ప్రతిపాదనలు పంపారు.ఆ ప్రతిపాదనల్లో అహ్మదాబాద్‌ను  ప్రధాన హోస్ట్‌ సిటీగా, భువనేశ్వర్‌ మరియు న్యూఢిల్లీని సపోర్టింగ్‌ సిటీలుగా సూచించారు. ఆగస్ట్‌ 13న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక జనరల్‌ మీటింగ్‌ లో ఏకగ్రీవంగా కామన్‌వెల్త్‌ బిడ్‌కి ఆమోదం తెలిపింది. అనంతరం ఆగస్ట్‌ 27న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కూడా బిడ్‌ సమర్పణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.యూత్‌ అఫైర్స్‌, స్పోర్ట్స్‌ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు, ఆగస్ట్‌ 31 చివరి తేదీకి ముందు ఐఓఏ అధికారికంగా బిడ్‌ దాఖలు చేసింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu