మూసీ పునరుజ్జీవ పనులను సీఎం రేవంత్‌ శ్రీకారం

 

మూసీ పునరుజ్జీవ పనులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉస్మాన్‌సాగర్‌ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీటిని  తరలించే ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను మంచినీటితో నింపనున్నారు. రూ.7,360 కోట్లతో హ్యామ్‌ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో గోదావరి ఫేజ్‌ 2, 3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని అన్నారు. సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎవరు అడ్డం వచ్చినా ఈ పథకం పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ పథకం ద్వారా హైదరాబాద్‌ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా, నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య తీరుతుంది. బీఆర్‌ఎస్ వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది.  మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలి. త్వరలో మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలుస్తా అని సీఎం రేవంత్‌ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu