జగన్ కి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్
posted on Oct 26, 2012 11:33AM
.jpg)
కేంద్ర క్యాబినెట్ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయ్. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల లాబీయింగ్ జోరుగా సాగుతోంది. బెర్త్ కావాలనుకున్నవాళ్ల నేరుగా ఢిల్లీలో మకాం పెట్టి పైరవీలు చేసుకుంటున్నారు. మొదట్నుంచీ చిరంజీవి పేరు వినిపిస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంతంనుంచి ఓ వ్యక్తికి క్యాబినెట్ లో చోటు కల్పిస్తే ఉద్యమం ఉద్ధృతి కొంత తగ్గుతుందన్న ఆలోచనతో సర్వే సత్యనారాయణ పేరు పరిశీలనలోకొచ్చింది. ఎవరూ ఊహించడానిక్కూడా వీల్లేని విధంగా మరో వ్యక్తి పేరు తెరమీదికి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి వెంటనే ఢిల్లీకి రమ్మని అధిష్ఠానంనుంచి పిలుపొచ్చింది. అంతేకాదు.. ఢిల్లీలో తమకి అందుబాటులో ఉండమని కూడా అధిష్ఠానం ఆదేశం. రాయలసీమలో బలమైన ప్రాబల్యం ఉన్న రెడ్లని తమవైపుకి తిప్పుకోవాలంటే యాంటీ వై.ఎస్ గ్రూప్ లో కాస్తో కూస్తో జనంలో పట్టున్న నేత అవసరం. సూర్యప్రకాశ్ రెడ్డిని పైకి లాక్కొస్తే యాంటీ జగన్ వేవ్ కూడా కలిసొస్తుందన్న కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం. ముందునుంచీ కోట్ల కుంటుబానికీ, వై.ఎస్ కుటుంబానికీ మధ్య ఉన్న వైరాన్ని క్యాష్ చేసుకో గలిగితే రాయలసీమలో యాంటీ జగన్ గ్రూప్ కి చెందిన ఓ వ్యక్తి తమ చేతిలో ఉంటాడన్నది అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు.