చాలా టైట్ గా ఉన్న లో దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?


దుస్తులు శరీరాన్ని కప్పి ఉంచుతాయి.  శరీరానికి వాతావరణం నుండి రక్షణ కూడా ఇస్తాయి.  ఇప్పట్లో లో దుస్తులు ధరించడం చాలా కామన్. ఆడవారు అయినా మగవారు అయినా లో దుస్తులు ధరిస్తారు.  అయితే లో దుస్తుల ఎంపికలో కొందరు తప్పులు చేస్తారు.  చాలా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తారు.  లో దుస్తులే కదా ఏం అవుతుందిలే అనే కారణంతో కొందరు సైజ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా లో దుస్తులు కొనుగోలు చేస్తారు.  అయితే లో దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు,  ఎలాంటి ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి,  సౌకర్యం, సైజ్ వంటి విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలా టైట్ గా ఉన్న లో దుస్తులు ధరిస్తే శరీరం షేప్ బాగా కనిపిస్తుందని అనుకుంటారు. కానీ చాలా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..


లో దుస్తులు ధరించడం వల్ల నష్టాలు కలుగుతాయి.  అవి ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించడం వల్ల పెల్విక్ ప్రాంతం చుట్టూ దురద వస్తుంది. దీని కారణంగా నొప్పితో పాటు దురద కూడా వస్తుంది.  ఇది క్రమంగా ఇన్ఫెక్షన్లు, చర్మం దెబ్బ తినడానికి కారణం అవుతుంది.

చాలా బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే అది తొడపై భాగంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది తొడపై ప్రభావం చూపిస్తుంది.  రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఆ ప్రాంతాలలో కండరాలు, నరాలపై ప్రభావం పడుతుంది.


బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తే తొడపై ప్రభావం పడుతుంది.  దీని వలన కాళ్లు తిమ్మిరిగా అనిపించవచ్చు. ఈ పరిస్థితిని తేలికగా తీసుకుంటే చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇలా బిగుతుగా ఉన్న దుస్తులు ఎక్కువ కాలం వేసుకుంటూ ఉంటే అది నడవడంలో ఇబ్బందులు సృష్టిస్తుంది.  ముఖ్యంగా లో దుస్తులను రోజంతా వేసుకుంటాం కాబట్టి సమస్య ఎక్కువ ఉంటుంది.


బిగుతుగా ఉండే బ్రా,  పెట్టీ కోట్స్,  టాప్స్ వంటివి వేసుకోవడం వల్ల పొట్ట కూడా బిగుతుగా ఉంటుంది.  దీని వల్ల అసిడిటీ సమస్య రావచ్చు.  బిగుతుగా ఉండే లో దుస్తులు ధరించడం వల్ల ఛాతీ బాగానికి రక్తప్రసరణ కూడా తగ్గుతుంది.


బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే ప్రైవేట్ ప్రాంతంలో గాలి ప్రసరణ నిరోధిస్తుంది.  దీని వల్ల చెమట ఆరిపోవడానికి అవకాశం ఉండదు.  దీని కారణంగా బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ఏర్పడుతుంది.  అందుకే బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించకూడదు.  లో దుస్తులు ఎప్పుడూ కాటన్ వే ఎంచుకోవాలి. ఇవి చెమటను పీల్చుకుని ప్రైవేట్ ప్రాంతాన్ని పొడిగా ఉంచుతాయి.  అలాగే లో దుస్తులను బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి.   వీటిని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాల్సిన పని లేదు.  సరిగా ఆరని లో దుస్తులు ధరించినా,  శుభ్రత లేని లో దుస్తులు ధరించినా వాటి వల్ల ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి.

                                     *రూపశ్రీ.

 

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...