గ్యాస్ట్రిక్ సమస్య వేధిస్తోందా? ఇదిగో ఇలా చెక్ పెట్టండి..!
posted on Feb 6, 2025 9:30AM

ఈ రోజుల్లో చాలా మందిలో కనిపించే సమస్యలలో పొట్ట సంబంధ సమస్యలు ఎక్కువ. మరీ ముఖ్యంగా పొట్టలో గ్యాస్ ఏర్పడటం ప్రధానంగా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడితే కడుపు పూర్తిగా గట్టిగా ఉంటుంది. దీని కారణంగా చాలా ఇబ్బంది ఎదుర్కోవాలి. కడుపు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మల విసర్జన సాఫీగా జరగకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య శారీరక స్థితిని మాత్రమే కాకుండా, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. మలబద్ధకం సమస్య అనేక సమస్యలను కలిగిస్తుంది. మలబద్దకం తగ్గితే చాలా వరకు గ్యాస్ ప్రాబ్లం ను అధిగమించడానికి వీలవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టడానికి ఇంట్లోనే ట్రై చేయాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
నిమ్మకాయ, సెలెరీ..
చాలాకాలంగా మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడేవారు నిమ్మకాయతో సెలెరీ కలిపి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే సెలెరీ జ్యూస్ తయారుచేసుకోవాలి. ఇందులో కాస్త నిమ్మరసం పిండి ఆ జ్యూస్ ను తాగాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే శరీరం మొత్తం శుభ్రమవుతుంది. పొట్ట సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది.
గ్రీన్ టీ..
మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి గ్లీన్ టీ బాగా పని చేస్తుంది. గ్రీన్ టీ లోో పైబర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. చాలా కాలంగా మలబద్దకంతో బాధపడుతుంటే ముందుగా పాలతో చేసిన టీ,కాఫీ తాగడం మానెయ్యాలి. పాలతో చేసిన టీ, కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది గ్యాస్ సమస్యను పెంచుతుంది. వీటి స్థానంలో గ్రీన్ టీ తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
ఇసబ్గోల్..
గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఇసాబ్గోల్‌ను కూడా ఉపయోగించవచ్చు . ఇది సహజ భేదిమందు. ఇది గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ఇసబ్గోల్ ను నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి త్రాగాలి. ఇది చాలా త్వరగా సమర్థవంతంగా పనిచేస్తుంది.
బొప్పాయి..
ఎప్పుడూ గ్యాస్, మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటుంటే ప్రతిరోజూ బొప్పాయి తినవచ్చు. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య నుండి చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...