క్యాన్సర్ ను ఆమడదూరం ఉంచే రంగురంగుల ఆహారం.. రెయిన్ బో డైట్..!

 


క్యాన్సర్ చాలా మందిని కలవర పెట్టే సమస్య.  క్యాన్సర్ వచ్చిందంటే ఇక చావు ఖాయం అనుకుంటారు కొందరు. దీనికి పేదోళ్లు వైద్యం చేయించుకోలేరు.. ధనికులకే ఆ వైద్య ఖర్చులు భరించే సామర్థ్యం ఉంటుంది అంటారు. అయితే క్యాన్సర్ వచ్చాక దానితో పోరాడటం కాదు.. క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి? ఏం చేస్తే క్యాన్సర్ ఆమడ దూరంలో ఉంటుంది? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

క్యాన్సరు.. హెచ్చరిక రంగులు..

క్యాన్సర్ అనగానే భయపడతారు సరే.. క్యాన్సర్ లో కూడా బోలెడు రకాలు ఉన్నాయి.  క్యాన్సర్ రకాన్ని.. అది శరీరంలో పలు అవయవాలకు సంక్రమించడాన్ని బట్టి క్యాన్సర్ కు హెచ్చరిక రంగులు,  రిబ్బన్ గుర్తులు ఉన్నాయి.

గులాబీ రంగు రిబ్బన్.. రొమ్ము క్యాన్సర్ ను

నారింజ రంగు రిబ్బన్.. లుకేమియా ను

నలుపు రంగు రిబ్బన్.. చర్మ క్యాన్సర్ ను

పసుపు రంగు  రిబ్బన్.. బోన్ క్యాన్సర్ ను

తెలుపు రంగు రిబ్బన్.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను

టీల్ బ్లూ రంగు రిబ్బన్..   అండాశయ క్యాన్సర్ ను

నీలం, గులాబీ, టీల్ రంగు రిబ్బన్లు.. థైరాయిడ్ క్యాన్సర్ ను

పీచ్ కలర్ రిబ్బన్.. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ను

టీల్ అండ్ వైట్ రిబ్బన్.. సర్వైకల్ క్యాన్సర్ ను.. ఇలా రిబ్బన్ రంగులు వివిధ రకాల క్యాన్సర్లను సూచిస్తాయి.

క్యాన్సర్ రాకుండా రంగురంగుల ఆహారం..


క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా శరీరం ఏ జబ్బుల బారిన పడకుండా ఉండాలన్నా రంగురంగుల ఆహారాలు తీసుకోవాలని అంటున్నారు.   ముఖ్యంగా రెయిన్ బో డైట్ క్యాన్సర్ ను ఆమడ దూరంలో ఉంచడంలో ప్రసిద్ధి చెందింది.


పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, పర్పుల్ కలర్.. ఇలా రెయిన్ బో లో ఉండే ఏడు రంగుల మేళవింపులో ఆహారం తీసుకుంటే చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్ లు, పైబర్.. ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో కూడా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. ఇలా అన్నీ తీసుకోవాలి.  సీజనల్ పండ్లు, కూరగాయలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.  సీజనల్ కూరగాయలు, ఆకుకూరలు ఆయా.. సీజన్ లలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి.  కాబట్టి ఆహారం ద్వారా.. మద్యపానం, ధూమపానం,  గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు దూరం ఉండటం ద్వారా.. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమై అలవాట్లను కలిగి ఉండటం ద్వారా క్యాన్సర్ మహమ్మారికి ఆమడదూరం ఉండవచ్చు.


                                                *రూపశ్రీ. 

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...