Home

»

Latest News

నాలో మార్పు వచ్చింది..నా జీవిత భాగస్వామి ఎవరో తెలుసా!

May 17, 2025

విజయదేవరకొండ(Vijay Devarakonda)ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ'కింగ్ డమ్'(Kingdom)తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)దర్సకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న'కింగ్ డమ్' జులై 4 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, విజయ్ దేవరకొండ లుక్ తో మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.


రీసెంట్ గా ఫిలింఫేర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ జీవిత బాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మిక(Rashmika Mandanna)లో ఉన్నాయా అనే ప్రశ్న విజయ్ దేవరకొండ కి ఎదురయ్యింది. ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతు రష్మిక తో ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. ఆమె ఎంతో మంచి వ్యక్తి తో పాటు చాలా అందమైన నటి. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి ఏం ఆలోచించడం లేదు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా పర్లేదు. సినిమాల పరంగాను  లైగర్ పరాజయం తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చాడు.

రష్మిక, విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నారనే వార్తలు చాలా కాలం నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్మిక, విజయదేవరకొండ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి హిట్ ఫెయిర్ గా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.  


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com