ENGLISH | TELUGU  
Home  » Gossips

బిగ్ సర్ ప్రైజ్.. మరో మల్టీస్టారర్ లో రామ్ చరణ్..!

on May 17, 2025

 

జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ చేశాడు రామ్ చరణ్ (Ram Charan). అలాగే 'ఆచార్య'లో తన తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పడు చరణ్ మరో మల్టీస్టారర్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి వెంకటేష్ (Venkatesh)తో తెరను పంచుకోబోతున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

 

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మైథలాజికల్ టచ్ ఉన్న భారీ సినిమా చేయాల్సి ఉంది. అయితే బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ గ్యాప్ లో ఓ మూవీ చేయాలని త్రివిక్రమ్ చూస్తున్నాడు. అది కూడా వెంకటేష్ తో ఆ సినిమా ఉంటుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల అనూహ్యంగా రామ్ చరణ్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో వెంకటేష్, రామ్ చరణ్ లలో ఎవరితో త్రివిక్రమ్ సినిమా ఉంటుందనే చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో మరో ఆశ్చర్యకర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే వెంకటేష్, రామ్ చరణ్ లతో త్రివిక్రమ్ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడట. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్. అదే నిజమైతే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం.

 

వెంకటేష్ ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు చరణ్ తో తెరను పంచుబోతున్నట్లు వినిపిస్తున్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకొని వెంకీ మామ ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరోవైపు చరణ్ కూడా 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అలాంటిది ఈ ఇద్దరి కలయికలో మల్టీస్టారర్, దానికి త్రివిక్రమ్ డైరెక్టర్ అంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.