హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

 

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలో ఒక మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. మరోవైపు హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడలో  పెను అగ్నిప్రమాదం తప్పిన తప్పింది. పెట్రోల్ ట్యాంకర్ బ్యాటరీ పేలడంతో  మంటలు చెలరేగాయి. 

పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ లారీ ఉండటంతో సమయానికి ఘటనాస్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని. ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు చనిపోతున్నారని అన్నారు. అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై ఇప్పటికైనా సమీక్ష నిర్వహించాలని వారు కోరుతున్నారు