భారత్ తొలి బులెట్ ట్రైన్ ప్రాజెక్టుని దక్కించుకొన్న జపాన్

 

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశానికి నిజమయిన అభివృద్ధి అంటే ఏవిధంగా ఉంటుందో ప్రజలకు కళ్ళారా చూపిస్తున్నారు. ఆయన ప్రకటించిన అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులలో బులెట్ ట్రైన్ కూడా ఒకటి. ముంబై-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తామని ఆయన అధికారం చేపట్టిన నాలుగయిదు నెలలకే ప్రకటించారు. అప్పుడు ఎవ్వరూ ఆయన మాటలను నమ్మలేదు. కానీ ఆ ప్రాజెక్టుకి నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర కూడా వేసింది. సుమారు రూ.98,000 కోట్లతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుని జపాన్ దక్కించుకొంది. ఈ ప్రాజెక్టు కోసం చైనా కూడా పోటీ పడింది. కానీ భద్రతా ప్రమాణాలను పాటించడంలో, సాంకేతికంగా కూడా జపాన్ బులెట్ ట్రైన్ లే అన్ని విధాల మెరుగుగా ఉన్నాయని భావించడంతో జపాన్ కే ఈ ప్రాజెక్టును కట్టబెట్టాలని కేంద్రప్రభుత్వం నిశ్చయించుకొంది. జపాన్ ప్రధాని సింజు ఆబే భారత్ లో మూడు రోజుల పర్యటన కోసం రేపు డిల్లీకి వస్తున్నారు. ఆ సందర్భంగా ఇరు దేశాలు ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఒక ప్రకటన చేయవచ్చును.

 

ముంబై-ఆహ్మదాబాద్ మధ్య 505 కిమీ దూరం ఉంది. దానిని అధిగమించడానికిమన సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్ళు సుమారు 7గంటల సమయం పడుతుంది. అదే బులెట్ ట్రైన్ అయితే ఆ దూరాన్ని కేవలం రెండు గంటల్లో అధిగమించగలదు. అది గంటకు 250-300 కిమీ వేగంతో నడుస్తుంది. ఈ బులెట్ ట్రైన్ వస్తే ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య తిరిగే విమాన సర్వీసులు వేరే మార్గంలో నడుపుకోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu