బొర్రా గుహల్ని మూసేశారు
posted on Oct 10, 2012 4:51PM
.jpg)
బొర్రాగుహల్ని మూసేశారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా తాళంవేశారు. గుహల్లో ఉన్న ప్రకృతి సిద్ధమైన లింగాల్ని చూసేందుకు దూర తీరాలనుంచి వచ్చిన టూరిస్టులు బాగా నిరుత్సాహపడిపోయారు. ఇంతకీ బొర్రా గుహలకు తాళంకప్పలు పెట్టేసింది ఎవరో తెలుసా.. పర్యాటక శాఖ కాంట్రాక్ట్ వర్కర్లు.. చాలాకాలంగా తమ ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడుతున్న కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. టైడా, అనంతగిరి దగ్గరకూడా టూరిస్టుల్ని పర్యాటక శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఇలా చేయడంవల్ల మాత్రమే తమ గోడుని ప్రభుత్వం పట్టించుకుంటుందని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు. వెంటనే తమ డిమాండ్లని పరిష్కరించకపోతే రెగ్యులర్ గా ఇలాగే పర్యాటకుల్ని అడ్డుకుంటామని, దానివల్ల పర్యాటకశాఖకి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుందని కాంట్రాక్ట్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.