లాల్ దర్వాజా మహంకాళీ ఆలయంలో చోరీ
posted on Oct 10, 2012 4:41PM
.jpg)
హైదరాబాద్ లో లాల్ దర్వాజా మంహంకాళి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దాదాపు 15 లక్షల రూపాయల విలువచేసే నగలతోపాటు అమ్మవారి వెండి కళ్లని కూడా దొంగలు ఎత్తుకెళ్లడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. నిజాం నవాబు అమ్మవారికి కానుకగా ఇచ్చిన వజ్రాన్నికూడా దొంగలు దోచుకెళ్లారు. ఈ వజ్రాన్ని అమ్మవారికి పెట్టే బొట్టులో పొదిగారు. చాలాకాలంగా ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆధికారులు పట్టించుకోకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందంటూ పెద్దఎత్తున భక్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆలయంముందు పెద్దఎత్తున ఆందోళనకూడా జరిపారు. దొంగల్ని వెంటనే పట్టుకుని అమ్మవారి నగల్ని రికవర్ చేయాలని భక్తులు కోరుతున్నారు.