ములాయం సింగ్ కి ఎన్సీపీ టాటా...బైబై..

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం నరేంద్ర మోడిని ఎదుర్కోవడానికే ఆరు పార్టీలు కలిసి ములాయం సింగ్ నేతృత్వంలో జనతా పరివార్ ఎప్రాటు చేసుకొన్నాయి. కానీ అందులో ప్రధాన భాగాస్వాములుగా ఉన్న నితీష్ కుమార్ (జె.డి.యు) లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్.జె.డి) ములాయం సింగ్ కి తెలియకుండా తలో వంద సీట్లు పంచేసుకొని మిగిలిన 40 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేయడంతో ఆగ్రహించిన ములాయం సింగ్ జనతా పరివార్ కి గుడ్ బై చెప్పేసి ఒంటరిగా పోటీకి దిగారు. ఆయనతో బాటే ఎన్సీపీ కూడా బయటకు వచ్చేసింది.

 

యస్పీ, ఎన్సీపి తదితర ఆరు పార్టీలు ఆయనతో చేతులు కలపడంతో అదొక తృతీయ కూటమిగా అవతరించింది. బీహార్ ఎన్నికలలో ఇప్పుడు ఎన్డీయే, జనతా పరివార్, వామపక్ష కూటమి, ఈ తృతీయ కూటమి పోటీ చేస్తున్నాయి. ములాయం సింగ్ తృతీయ కూటమికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ ఆయన క్రమంగా ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయవాదం కలిగిన పార్టీ అని మెచ్చుకొన్నారు. మళ్ళీ మొన్న జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో తమ కూటమికి ఓటువేయమని ప్రజలను కోరుతూనే బీహార్ లో బీజేపీ గాలి వీస్తోందని, ఈ ఎన్నికలలో బీజేపీయే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పడంతో తృతీయ కూటమిలో పార్టీలన్నీ కంగుతిన్నాయి. తమ కూటమిని గెలిపించామని ప్రజలను అడగవలసిన ములాయం సింగ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం చూసి వారు విస్తుపోయారు.

 

అందుకు ఆగ్రహించిన ఎన్సీపీ తాము తృతీయ కూటమి నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాదేందుకే తాము తృతీయ కూటమిలో జేరితే ములాయం సింగ్ మళ్ళీ అదే బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని అందుకే తృతీయ కూటమి నుండి వైదోలగుతున్నామని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ ప్రకటించారు. అయితెహ్ ఎన్సీపీ మొదట అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పనిచేసేందుకు సిద్దపడిన విషయాన్ని ఆయన దాచిపెట్టినా దాగే విషయం కాదు. జనతా పరివార్ తో కాంగ్రెస్ పార్టీతో బాటు ఎన్సీపీ కూడా మొదట చేతులు కలిపింది. కానీ కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కేటాయించి తమకు కేవలం మూడు సీట్లే ఇచ్చినందుకు నిరసనగా ములాయం సింగ్ తో కలిసి బయటకొచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు తృతీయ కూటమి నుండి కూడా బయటకు వెళ్లిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu