లార్డ్స్ టెస్టులో అదరగొట్టిన నితీశ్..ఒకే ఓవర్లో 2 వికెట్లు
posted on Jul 10, 2025 5:14PM

ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదన వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి అదరగొట్టారు.
తాను వేసిన తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపేనర్లు డకెట్ (23) క్రానే (18)ను పెవిలియన్‌కు పంపారు. ఇదే ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ గిల్ పట్టి ఉంటే వికెట్లు పడేవి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లపై పేస్ బౌలింగ్ భారం ఉండగా, వారికి ఆకాశ్ దీప్ సహకారం అందించనున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడి రాకతో టీమిండియా పేస్ విభాగం మరింత బలోపేతమైంది.