వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమ వైఫల్యమే కారణం
posted on Jan 6, 2026 8:35AM
.webp)
సిద్దిపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ లు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే కులాలు వేరు అన్న కారణంతో ప్రణయ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన లావణ్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వైద్య విద్యార్థిని కావడంతో పాయిజెనెస్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. లావణ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.