బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం : మంత్రి ఉత్తమ్

 

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించ తలపెట్టిన పోలవరం-బసకచర్ల ప్రాజెక్టును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును తిరస్కరించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు. బసకచర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని ఈ ప్రాజెక్టు విషయంలో విభజన చట్టాన్ని కూడా ఏపీ ఉల్లంఘిస్తోందని తెలిపారు. నేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రాన్నికి సమర్పిస్తాం అని పేర్కొన్నారు. 

బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గోదావరి-బనకచర్ల  లింక్ ప్రాజెక్టు పై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా బీఆర్ఎస్ నుంచి ఎంపీ రవిచంద్ర, బీజేపీ నుంచి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీలు సురేష్ షట్కర్, రఘరాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, చాలమ కిరణ్ కుమార్ రెడ్డి, బలరామ్ నాయక్, మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.