రాజా సింగ్ రాజీనామా గోషామహల్ ఉప ఎన్నిక అనుమానమే

 

గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామ చేసిన  నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంతో పాటుగా గోషామహల్’నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుందన్న వ్యూహగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీకి రాజీనామా  చేసిన రాజా  సింగ్’ ఇంతవరకు  ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామ చేయలేదు. బీజీపీ అధ్యక్షుడికి రాసిన రాజీనామా లేఖను, అసెంబ్లీ స్పీకర్’కు పంపి, తనను అనర్హుడిగా ప్రకటించమని కోరాలని సూచన చేసారు. అయితే, రాజా సింగ్  ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. రాజీనామా చేయాలనుకుంటే రాజా సింగ్’  నేరుగా అసెంబ్లీ స్పీకర్’కే టం రాజీనాం లేఖను సంర్పించాలని, బీజేపీ అధికార ప్రతినిధులు స్పష్టం చేసారు. అలాగే, రాజసింగ్’ రాజీనామను తిరస్కరించి సందర్భంలోనూ బీజేపీ అధ్యక్షుడు, అనర్హత వేటు అంశాన్ని ప్రస్తావించలేదు. రాజా సింగ్ పార్టీ కోర్టులోకి కొట్టిన బండిని, బీజేపీ  తిరిగి  ఆయన కోర్టులోకి తిప్పికొట్టింది. 

అయితే,పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి  రాజా సింగ్ చేసిన రాజీనామాను, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించి వారం రోజులు పైగానే అయింది, అయినా, రాజా సింగ్ ఇంత వరకు ఎమ్మెల్యే పదవికి సంబంధించి పెదవి విప్పలేదు. మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు,పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసినా హిదుత్వ సిద్దాంతాన్ని వదలనని, వేరే పార్టీలో చేరనని  చెప్పారు. కార్యకర్తలకు ఉద్భోదలు చేసారు.,కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి మాత్రం ఇంత వరకు మాట్లాడ లేదు. రాజీనామా చేసే సంకేతాలు కూడా కనబడడం లేదు. మరోవంక  బీజేపీ కూడా వత్తిడి చేయడం లేదు. సో... రాజీనామా చేస్తారా ? స్వతంత్ర అభ్యర్ధిగా కొనసాగుతారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు.

అదొకటి అలా ఉంటే, ఒక వేళ రాజా సింగ్’ స్పీకర్ ఫార్మేట్’లో రాజీనామా సమర్పించినా, స్పీకర్’ను స్వయంగా కలిసి రాజీనామా ఆమోదించమని కోరినా,స్పీకర్’ వెంటనే రాజీనామాను ఆమోదిస్తారా? అంటే, అది కూడా జరగక పోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే, బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయం ఎటూ తేలకుండా వుంది. స్పీకర్’ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, న్యాయ స్థానాలు సూచించినా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పడు రాజ్ సింగ్ రాజీనామాను తక్షణం ఆమోదిస్తే, స్పీకర్’, విమర్శలను ఎదుర్కోనవలసి వస్తుంది. అందుకే,  రాజా సింగ్ రాజీనామా చేసినా, స్పీకర్ ఆమోదించక పోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో గోషామహల్ నియోజక వర్గానికి, ఉప ఎన్నిక వచ్చే  అవకాశం ఇంచుమించుగా లేనట్లే అంటున్నారు. ఒక  విధంగా ఇది, రోగి కోరుకున్నది  వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్లుగా ఉందని  పరిశీలకులు పేర్కొంటున్నారు.

 కారణాలు వేరైనా, ఎవ్వరూ కూడా ఉప ఎన్నికను కోరుకోవడం లేదు. అవును,అటు రాజా సింగ్ ఉప ఎన్నిక కోరుకోవడం లేదు, బీజేపీ పట్టుపట్టే పరిస్థితి లేదు.. అన్నిటికంటే ముఖ్యంగా అంతిమ తీర్పు ఇవ్వవలసిన స్పీకర్, తక్షణ నిర్ణయం తీసుకోక పోవచ్చని అంటున్నారు.అందుకే ..గోషామహల్ ఉప ఎన్నికపై ఆశలు పెట్టుకున్న మాధవీలత గోషామహల్ కాకపోతే జూబ్లీ హిల్స్’ అంటూ అటుగా చూస్తున్నారు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా గెలుస్తా, అసెంబ్లీలో అడుగు పెడతా అంటన్నారు.అయితే ఆమె ఏకపక్షంగా చేస్తున ప్రకటనల విషయంలో ఇప్పటికీ పార్టీలో వ్యతిరేకత వ్యక్త మవుతోంది. నిజానికి, పార్టీ నాయకత్వం కూడా ఇప్పటికే ఆమెను, హెచ్చరించినట్లు చెపుతున్నారు.మాధవీ లత విష్యం ఎలా ఉన్నా, రాజా సింగ్ రాజీనామా, గోషామహల్ ‘  ఉప ఎన్నిక  రెండూ అనుమానమే, అంటున్నారు.