పంద్రాగస్టు నుంచి జాతీయ రహదారుల్లో యాన్యువల్ ఫాస్టాగ్ పాస్
posted on Jun 18, 2025 5:22PM

జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో ఫాస్టాగ్ యాన్యూవల్ పాస్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ యాన్యువల్ పాస్ రూ. 3 వేలు ఉంటుందని గడ్కరీ పేర్కొన్నారు. ఏడాది పాటు 200 ట్రిప్పులు పరిమితి ఉంటుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, నాన్ కమర్షియల్ వెహికల్స్ కు ఇది వర్తిస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల్లో ఈ యాన్యువల్ పాస్ పనిచేస్తుందని తెలిపారు.
ఈ యాన్యువల్ పాస్ యాక్టివేషన్ కోసం రాజ్ మార్గ్ యాప్ తో పాటు NHAI, MoRTH వెబ్‌సైట్లలో త్వరలోనే ఓ లింక్ ను అందుబాటులోకి తేనున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 200 టోల్స్‌కు కేవలం రూ.15 ఖర్చవుతుందని తెలిపారు. నూతన విధానంలో వాహనదారులకు రూ. 700 వరకు ఆదా అవుతుంది. ఇది కేవలం జాతీయ రహదారులపై మాత్రమే అని రాష్ట్ర రహదారులపై ఉండే టోల్స్‌కి వర్తించదని స్పష్టం చేశారు.