హెచ్‌సీఏపై మనీలాండరింగ్ కేసు
posted on Jul 17, 2025 7:54PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఐదుగురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలు కవిత యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ల కింద నమోదైంది. PMLA సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
బీసీసీఐ నుంచి వచ్చిన నిధులలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. హెచ్‌సీఏ అక్రమాల వ్యవహారంలో ఏసీబీ సోదాల సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణ నేపథ్యంలో ఉప్పల్ సీఎ ఎలక్షన్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. హెచ్‌సీఏ సెక్రెటరీ దేవరాజ్ కు ఆయన సహకరించినట్టు శాఖాపరమైన విచారణలో వెల్లడయింది. దేవరాజ్ అరెస్ట్ కు కూడా సీఐడీ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఫేక్ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. నకిలీ పత్రాల ద్వారానే హెచ్‌సీఏలో ఆయన అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు విచారణలో తేలింది.