ప్రముఖ నటికి ఏడాది జైలు శిక్ష!
on Jul 17, 2025
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు 'విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ మరియు అక్రమ రవాణా నివారణ చట్టం' (COFEPOSA) కింద ఏర్పాటైన అడ్వైజరీ బోర్డు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది శిక్ష కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కూడా నిరాకరించింది. దీంతో ఆమె ఏడాది పాటు జైలు నుంచి విడుదల అయ్యే ఛాన్స్ లేదు. (Ranya Rao)
మార్చి 1న బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌ఫోర్ట్‌లో దుబాయ్ నుంచి రూ.12.56 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు నటి రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ సాహిల్ జైన్ కూడా అరెస్ట్ అయ్యారు. తాజా తీర్పు ప్రకారం ఈ ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సిఉంది. ఈ కేసులో ప్రతి మూడు నెలలకు ఒకసారి విచారణలు జరుగుతాయని బోర్డు పేర్కొంది. ఇలా ఏడాది వరకు కొనసాగుతాయని తెలిపింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
