ఆంధ్రప్రదేశ్‌లో 66 ఏఎంసీలకు ఛైర్మన్లు ఖరారు
posted on Jul 17, 2025 9:37PM
.webp)
వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. 66 వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లకు ఛైర్మన్లను ఖరారు చేసింది. వీటిలో 9 చోట్ల జనసేన, 4 చోట్ల బీజేపీ నేతలకు అవకాశం కల్పించారు. 66 ఛైర్మన్ పదవుల్లో 17 మంది బీసీలు, 10 ఎస్సీలు ఉన్నారు. ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు.
మొత్తం 66 ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పించారు. ఇది వరకే కొన్ని ఏఎంసీలకు ఛైర్మన్లను ఖరారు చేయగా.. తాజాగా మరో 66 మందిని ప్రభుత్వం ప్రకటించింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు రైతులకు వారి ఉత్పత్తులకు సరైన రేటులు అందేలా, మార్కెట్ వ్యవస్థను నియంత్రించేలా పనిచేస్తాయి. ఈ కమిటీలు రైతులకు, వ్యాపారులకు మధ్య వారధిగా ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఈ నియామకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.