వైసీపీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది : నారా లోకేశ్

 

మాజీ సీఎం జగన్ పల్నాడు రెంటపాళ్ల గ్రామ పర్యటన సందర్బంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసీపీ పద్ధతి మారలేదు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం అని ఎక్స్‌లో లోకేశ్ స్పష్టం చేశారు. 

కాగా జగన్ పర్యటనలో కొందరు వివాదాస్పద ఫ్లకార్డులను ప్రదర్శించారు. పుష్ప సినిమా డైలాగులను ఫ్లకార్డులపై ప్రదర్శించారు. జగన్ వస్తాడు..అంతుచూస్తాడు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాకుండా గంగ‌మ్మ‌త‌ల్లి జాత‌ర‌లో వేట త‌ల‌లు న‌రికిన‌ట్టు న‌రుకుతం ఒక్కొక్కడిని అంటూ జ‌గ‌న్ ఫోటోల‌తో ఉన్న ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.