వార్డు సచివాలయాల్లో సమస్యలకు చెక్.. ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో  వార్డు సచివాలయాలలో పాలనాపరమైన సమస్యలకు తెరపడినట్లే. ఇప్పటి వరకూ గ్రామ, వార్డు సచివాలయాలలో విద్యాంశాలను డిజిటల్ సెక్రటరీయే చూస్తున్నారు. దీని వల్ల ఇంత కాలం డిజిటల్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతూ వచ్చింది.

ఈ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీల విధుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. దీంతో  ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో మాదిరిగానే వార్డులలోనే విద్యను సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షణలోకి వెడుతుంది. దీంతో పాలనాపరంగా సమస్యలకు తెరపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu