తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

 

తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీ రేపు శ్రీవారిని దర్మించుకోనుంది. రేణిగుంట విమానశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావులకేశవ్ స్వాగతం పలికారు.  సీఎం సతీమణి, అల్లుడు, కూతురు మనుమడిని ఆప్యాయంగా పలుకరించారు. 

గాయత్రి గెస్ట్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంత్రులతో  కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని, పద్మావతి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు. రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుని, అనంతరం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu