ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు

 

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైద్య  నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారు (నేచురాపతి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. పోచంపల్లి శ్రీధర్‌రావు (మాస్‌ కమ్యూనికేషన్‌)ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. 

రెండేళ్ల పాటు వీరు తమ పదవుల్లో కొనసాగనున్నారు.   డాక్టర్ మంతెన సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu