వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

 

వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలలో రేపటి నుంచి ప్రారంభం కానున్న  వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. టీటీడీ  సీవీఎస్వో, జిల్లా ఎస్పీ, చీఫ్‌ ఇంజినీర్‌, పలు విభాగాల అధికారులు టీటీడీ ఛైర్మన్ వెంట ఉన్నారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ క్యూలైన్‌ ఎంట్రీ పాయింట్స్ వద్ద క్షేత్రస్థాయిలో సదుపాయాలను వారు పరిశీలించారు. 

వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి డిసెంబర్‌ 30, 31, జనవరి 1 తేదీల్లో 1.89 లక్షల టోకెన్లను ఈ-డిప్ ద్వారా టీటీడీ కేటాయించింది. టోకెన్లు ఉన్న భక్తులకే ఆ మూడు రోజుల్లో దర్శనం కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద టోకెన్ స్కానింగ్ ప్రక్రియను ఛైర్మన్‌కు అధికారులు వివరించారు.  క్యూలైన్ ఎంట్రీ వద్ద భక్తులకు కల్పించి సదుపాయాలను ఆయన తనిఖీ చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu