తెలుగు రాష్ట్రాల్లో ‘దసరా ధమాకా‘

ఈ దసరాకి విజయదశమి రోజున ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో కీలక ఘట్టాలు చోటుచేసుకోబోతున్నాయి, వాటిలో నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఒకటైతే, అదేరోజు మంత్రివర్గ విస్తరణ కూడా చేయబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదేరోజు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని తెలుస్తోంది, ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ నర్సింహన్ ను కలిసిన కేసీఆర్.... దానిపై చర్చించారని చెబుతున్నారు. చంద్రబాబు కూడా త్వరలో గవర్నర్ ను కలిసి మంత్రివర్గ విస్తరణపై వివరిస్తారని అంటున్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా దసరా పండుగులా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్న చంద్రబాబు... విజయదశమి రోజునే మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టాలని భావిస్తున్నారని తెలిసింది, దసరాకి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్న బాబు... పలువురి శాఖలు మార్చడంతోపాటు కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారట, బాబు కొత్త టీమ్ లో గుమ్మడి సంధ్యారాణి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎంఏ షరీఫ్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇటు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్... కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు కసరత్తు చేస్తున్నారు, ఒకరిద్దరి శాఖలు మార్చడంతోపాటు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu