అలీఘడ్‌ యూనివర్సిటీలో ఆవుమాంసం!

 

ఆవుమాంసం (బీఫ్‌) గురించి గొడవలు దేశవ్యాప్తంగా ఎక్కడో అక్కడ చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రతిష్టత్మక అలీఘడ్‌ విశ్వవిద్యాలయం కూడా ఈ వివాదంలో చిక్కుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీలోని మెడికల్‌ క్యాంటీన్లో ఆవుమాంసాన్ని విక్రయిస్తున్నారంటూ వచ్చిన పుకార్లు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ వార్త విన్నవెంటనే బీజేపీ తదితర పార్టీలన్నీ కూడా విద్యాలయం ముందర ధర్నాకు దిగాయి.

 

విశ్వవిద్యాలయం తరఫున ప్రతినిధి అయిన రాహత్‌ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. తమనీ, తమ క్యాంటీన్నీ అప్రతిష్ట పాలు చేసేందుకు ఎవరో పన్నిన కుట్రగా ఆయన దీన్ని అభివర్ణించారు. 132 సంవత్సరాల క్రితమే తమ విశ్వవిద్యాలయంలో ఆవుమాంసాన్నీ, గోవధనీ నిషేధించామని ఆయన పేర్కొన్నారు. కానీ ఈ గొడవ మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu