జాట్ ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తి ఇతనే!
posted on Feb 20, 2016 3:28PM
.JPG)
కొద్ది రోజుల క్రితం వరకూ యశ్‌పాల్ మాలిక్ అంటే ఎవరో చాలామందికి తెలియదు. కానీ ఈ వారం హర్యానాలో పతాకస్థాయిని చేరుకున్న జాట్ ఉద్యమం గురించి వార్తలను వింటున్నవారికి అడపాదడపా ఆయన పేరు వినిపించడం మొదలుపెట్టింది. జాట్ వర్గం తనకు రిజర్వేషన్ల కోసం హర్యానాలో చేపడుతున్న ఆందోళనలకు కర్త, కర్మ ఆయనే. అఖిలభారత జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి (AIJASS) తరఫున ఆయన 2010 నుంచీ జాట్ వర్గానికి తగిన రిజర్వేషన్లను కల్పించాలంటూ పోరాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యశ్‌పాల్ ఘజియాబాద్, నోయిడా వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే మూటలు కట్టుకున్నారు.
హఠాత్తుగా ఏమనిపించిందో ఏమో కానీ గత కొద్ది సంవత్సరాలుగా జాట్ రిజర్వేషన్ల కోసం తన సమయాన్ని కేటాయించడం మొదలుపెట్టారు. ఉత్తరభారతదేశంలో నడిచే కులపంచాయితీలు (ఖాప్) అన్నా యశ్‌పాల్‌కు వల్లమాలిన అభిమానం. వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఓసారి ఆమీర్‌ఖాన్ మీద కూడా ఆయన మండి పడిపోయారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న జాట్‌లను కేంద్ర ప్రభుత్వం తన OBC జాబితాలో చేర్చేంతవరకూ ఈ ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు యశ్‌పాల్!