వైసీపీ గూటికి ప్రముఖ నటి జయసుధ
posted on Mar 7, 2019 1:12PM
.jpg)
ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి.. ఆయన సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఏడాది క్రితం టీడీపీలో చేరారు. కానీ టీడీపీ కార్యక్రమాల్లో ఆమె ఏనాడూ కూడ క్రియాశీలకంగా పాల్గొనలేదు. ఈమధ్య రాజకీయాల్లో కూడా ఆమె పేరు పెద్దగా వినపడలేదు. అయితే ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఆమె మళ్ళీ రాజకీయాల్లో యాక్టీవ్ అవబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆమె జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.