వైసీపీ కుట్రలు.. ఎన్నికల సంఘానికి పరిటాల సునీత ఫిర్యాదు

 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఓట్ల తొలగింపు రాజకీయం తారాస్థాయికి చేరింది. తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని, దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తుంటే.. తమ ఓట్లు తొలగించడానికే వైసీపీ కుట్రలు చేస్తుందని అధికార టీడీపీ ఆరోపిస్తోంది. ఎవరు ఎవరి ఓట్లు తొలగించడానికి కుట్రలు చేస్తున్నారో తెలీదు కానీ.. తాజాగా ఇదే విషయంపై మంత్రి పరిటాల సునీత ఎన్నికలు సంఘానికి ఫిర్యాదు చేసారు. తన నియోజకవర్గం రాప్తాడులో భారీ ఎత్తున ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారని పరిటాల సునీత అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ద్వివేదిని కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో మొత్తం 18,159 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు చేసారని చెప్పారు. ఎన్నికల్లో గెలవలేమనే భయంతో వైసీపీ అక్రమ మార్గాలను ఎంచుకుందని.. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని అన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేసారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu