ఓట్లు పోయిన వాళ్లంతా జగన్‌ను నిలయదీయండి
posted on Mar 7, 2019 1:42PM

ఓట్లు పోయినవాళ్లంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ని నిలదీయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తాజాగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా జగన్ మీద విమర్శలు గుప్పించారు. 'తెలుగుదేశం అంటేనే ఉత్సాహం, ఉత్సాహం అంటేనే తెలుగుదేశం. రేపటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలి, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి ఓ కొలిక్కి వచ్చి సంక్షేమం కొనసాగుతుంది. ఏమరుపాటుగా ఉంటే రాష్ట్రం దొంగలపాలవుతుంది.' అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో '2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రానికి అప్రదిష్ట వచ్చింది, ఆ ఐదేళ్లలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశాం. కానీ కొందరు బాధ్యతారహితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిని ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు.' అని హెచ్చరించారు. 'ఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు వైస్ జగన్. ఫారమ్-7 దుర్వినియోగం చేశామని అతనే ఒప్పుకున్నాడు. దీంతో బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫారమ్ - 7 కుట్రలు జరిగాయని స్పష్టమైంది. కాబట్టి ఓట్లు పోయిన వాళ్లంతా జగన్‌ను నిలయదీయండి. ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోండి.' అని మరో ట్వీట్ లో కోరారు.