నటి అంజలి కేసులో కొత్త ట్విస్ట్
posted on May 10, 2013 8:33AM

ప్రముఖ సినీ నటి అంజలి కుటుంబ వివాదం కొత్త మలుపు తిరిగింది. తమను కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఇళ్లు, ఆస్తులు వదిలేసి చెన్నై నుండి వెళ్లిపొవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంజలి పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం చెన్నై పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. కుటుంబం వివాదం నేపథ్యంలో ఐదు రోజుల పాటు అదృశ్యమయిన అంజలి వ్యవహారం సమసిపోతుంది అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదుతో మరింత రసకందాయంలో పడింది.
కొద్ది రోజుల క్రితం తనకు బెదిరింపు కాల్స్ రావడంతో తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నానని, ఇప్పుడు తన కుమారుడు, భర్తల సెల్ ఫోన్లకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఎలాంటి అనుమానాలు రాకుండా శాటిలైట్ ఫోన్ల నుండి ఫోన్లు చేస్తున్నట్లు అనుమానం వస్తుందని, చెన్నై వదలకుంటే చంపుతామని అంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు తమిళంలోనే మాట్లాడుతున్నారని అన్నారు.