పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ 'కోబలి'
posted on May 6, 2013 3:14PM
.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మించే ఈ సినిమాకి 'కోబలి' అనే టైటిల్ ని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పోరాట సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.