ఆదినారాయణరెడ్డి రాక వెనుక వ్యాపార లావాదేవీలు?

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రప్పించడం వెనుక వ్యాపార లావాదేవీలే ముఖ్య కారణమని తెలుస్తోంది, ఆదినారాయణరెడ్డితో పలువురు టీడీపీ ముఖ్యనేతలకు వ్యాపార సంబంధాలున్నాయని, ఓ ఉత్తరాంధ్ర మంత్రి అయితే మైనింగ్ బిజినెస్ లో పార్టనర్ ఉన్నాడని, అతనే ఈ కథంతా నడిపి... టీడీపీలోకి వచ్చేలా పావులు కదిపాడని చెప్పుకుంటున్నారు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి... ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్న నాయకుడే... ఆదినారాయణరెడ్డికి గంట కొడుతున్నాడని తెలిసింది.

అయితే ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి రప్పించడం వెనుక కడప జిల్లాకి చెందిన మరో సీనియర్ లీడర్ హస్తం కూడా ఉందంటున్నారు, ఎన్నికలకు ముందు బాబు కోటరీలో ముఖ్యనేతగా ఓ వెలుగు వెలిగిన ఈయనకు కూడా ఆదితో వ్యాపార లావాదేవీలున్నాయని, అందుకే ఉత్తరాంధ్రకి చెందిన మంత్రితో కలిసి తెలుగుదేశంలోకి వచ్చేలా లైన్ క్లియర్ చేశారని టాక్ వినిపిస్తోంది, ఆదినారాయణరెడ్డితో ఈ ఇద్దరికీ ఎప్పట్నుంచో బిజినెస్ పార్టనర్ షిప్ ఉందని, అది పార్టీలకు అతీతంగా సాగిందని, అయితే ఇప్పుడు దాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికే ఆదిని తెలుగుదేశంలోకి తీసుకొస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, ఆదినారాయణరెడ్డి వ్యవహారంపై కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది, పార్టీ కోసం రాత్రీపగలనక కష్టపడి ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తలకు విలువ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, ఇన్నాళ్లూ ఎవరికి వ్యతిరేకంగా పోరాడామో ఆ వ్యక్తినే ఇప్పుడు టీడీపీలోకి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  మీ వ్యాపార లావాదేవీల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu