లోకేష్ అంతరంగికుల్లో లుకలుకలు, అభీష్ట-వేమూరి కీచులాటలు

posted on: Oct 5, 2015 7:28PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు తనయుడు లోకేష్ మాట ఎంత నెగ్గుతుందో, దాదాపు అంతేస్థాయిలో ఆయన అంతరంగికుల మాట కూడా చెల్లుబాటవుతోంది, కేబినెట్ మీటింగ్స్, పొలిట్ బ్యూరో సమావేశాల్లో సైతం అభీష్ట పాల్గొనేవారంటే... ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో లోకేష్ దూతల పాత్ర ఏమిటో, వాళ్లకుండే ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. ఎంత ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు కూడా ఒక్కోసారి కొడుకు మాట వినాల్సిన పరిస్థితి, ఆ లెక్కన లోకేష్ అంతరంగికుల మాట ఏ స్థాయిలో చెల్లుబాటవుతుందో చెప్పక్కర్లేదు.

అయితే లోకేష్ కు కుడిభుజం, ఎడంభుజంగా వ్యవహరించే అభీష్ట, వేమూరి హరిప్రసాద్ మధ్య కీచులాటలు మొదలయ్యాయని టాక్. ఈ ఇద్దరి మధ్యా మొదలైన ఆధిపత్య పోరు చివరికి నువ్వానేనా అనుకునే స్థాయికి చేరాయంటున్నారు, ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన ప్రాజెక్టులను అభీష్ట అడ్డుకుంటున్నాడని హరిప్రసాద్ కోపంతో రగిలిపోతున్నాడని అంటున్నారు, అందుకే తనకు కనిపించిన ప్రతి టీడీపీ లీడర్ కు బాధ చెప్పుకుని గగ్గోలు పెడుతున్నాడట, దాంతో లోకేష్ అంతరంగికుల్లో తేడాలొచ్చాయనే సంగతి టీడీపీ వర్గాల్లో టాంటాం అయ్యింది.

ఇదిలా ఉండే లోకేష్ అంతరంగికుడు వేమూరి హరిప్రసాద్ సోదరుడు వేమూరి రవికి కేబినెట్ ర్యాంక్ హోదాతో ఎన్నారై కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టడంపై అభీష్టతోపాటు మరికొందరు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది, ఎన్నారైలతో మంచి సంబంధాలున్న కోమటి జయరాంను
కాదని ఊరూపేరూ లేని వేమూరి రవికి ఆ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించారట. అంతేకాదు 300కోట్ల రూపాయల విలువైన ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్ ను కూడా వేమూరి హరిప్రసాద్ కంపెనీకే కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇంత లబ్ధి జరిగినప్పటికీ ఇంకా తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు వేమూరి హరిప్రసాద్ కనిపించిన ప్రతి నాయకుడి దగ్గరా అభీష్టపై గగ్గోలు పెడుతున్నాడని, పైగా పార్టీకి తాను చేసిన సేవలకు చంద్రబాబు తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదని, తన పనులేమీ చేసిపెట్టడం లేదని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నాడని అభీష్ట వర్గం ఆరోపిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి, పార్టీ ద్వారా ఎంత లబ్ది పొందినా వేమూరి హరిప్రసాద్ ధన దాహం, కోరికలు మాత్రం తీరడం లేదని, అందుకే కనిపించిన ప్రతి వారి దగ్గరా తన గురించి చెడుగా చెబుతున్నాడని అభీష్ట ఆవేదన వ్యక్తంచేస్తున్నాడట, అయితే ఈ ఇద్దరి వ్యవహారం తెలిసిన టీడీపీ నేతలు మాత్రం... లోకేష్ అంతరంగికుల మధ్య కీచులాటలు తారాస్థాయికి చేరాయని గుసగుసలాడుకుంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...